'జయసింహ' ...నూట నలభై ఏళ్ల నాటి ఆణిముత్యం

updated: April 2, 2018 11:29 IST
'జయసింహ' ...నూట నలభై ఏళ్ల నాటి ఆణిముత్యం

కొందరు కాలాతీతమైన మనుష్యులు ఉంటారు...వాళ్లను చరిత్ర ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది.అలాగే కొన్ని రచనలు సైతం కాలాతీతంగా ఉంటుంది. వాటిని సాహిత్యం గుర్తు పెట్టుకుంటుంది. అలాంటి కాలాతీతమైన మనిషి..మహా రచయిత బంకించంద్ర ఛటర్జీ. ఈయన ఎంత గొప్ప రచయిత అంటే మనం రోజూ పాడుకునే వందేమాతరం గీతం ఆయన రచన ఆనంద్ మఠ్ నుంచి గ్రహించిందే. భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది ఆయన  సాహిత్య సేవ. అలాగే ఆయన రచన రాజసింహ (1882)  సైతం కాలాతీత రచన. రాజసింహ వచ్చి దాదుపు నూట నలభై ఏళ్లు అవుతున్నా  ఇప్పటికీ ఆసక్తికరంగా ఆన్ లైన్ లో అమ్మకాలు జరుగుతూ ,  చదివించగలుగుతోందంటే అది మామూలు విషయం కాదు. 

కథా నేఫధ్యం ఏమిటంటే ....?

రాజస్దాన్ లోని పర్వతప్రాంతంలో ఉన్న రూపానగరం అనే చిన్న రాజ్యంలో జరిగే కథగా ఈ నవల సాగుతుంది. ఆ రాజ్య రాకుమారి చంచలకుమారి చేసిన చిన్న మాట వల్ల రాజ్యం కూలిపోయే పరిస్దితి వస్తుంది. పెద్ద యుద్దమే సంభవిస్తుంది. అది కూడా ఎవరితో అప్పటి సుల్తాన్ ఔరంగజేబు చక్రవర్తితో. ఎక్కడో మారుమూల ఉన్న ఓ చిన్న రాజ్యంపై ..అంతటి చక్రవర్తి కత్తి కట్టాల్సిన అవసరం ఏమిటి... అసలామె ఏమి మాట తూలనాడింది...

 

ఓ రోజు ఆ రాజ్య అంతపురంలోకి ..చిత్రపటాలు అమ్ముకునే ఓ ముస్లిం ముసలామె ఒకతె వచ్చింది. ఏదో రాజకుటుంబం కదా చిత్ర పటాలు కొనుక్కుంటారని..వాటని చాలా ఇంట్రస్ట్ గా చూపెట్టసాగింది. అయితే రాజకుమార్తె చంచలాదేవికి కాస్తంత నోటి దురుసో లేక తమ రాజ్యానికి శనిలా దాపురించిన ముస్లిం ప్రభువంటే చిరాకో కానీ.. ఆ పటాల్లో పెద్ద గెడ్డంతో ఉన్న ... షాజహాన్ పటం చూసి వెటకారం ఆడింది. ఆ తర్వాత ఆ ముసలామె తెచ్చిన  ఔరంగజేబు పటం చూసి కొనుక్కుంది.  అయితే ఆ పటానికి ఇంకా పెద్ద అవమానం చేసింది. 

తన చెలికత్తెలని పిలిచి...మీలో ప్రతీ ఒక్కరూ వచ్చి ఎడమకాలితో పటాన్ని ఒక్క తన్ను తన్ని పోవాలి. ఎవరి కాలితాపుకు అతడి ముక్కు బ్రద్దలు అుతుందో చూద్దాం అంది. అది వినగానే అందరూ భయపడిపోయారు. అప్పటికీ ప్రధాన చెలకత్తే ఇలా అంది... రాకుమారి మీరిలింటి మాటలు అనకూడదు... గోజలకు చెవలుంటై..ఈ మాటలు ఆ నోటా ఆ నోటా పడి డిల్లీ నగరం చేరితో, మన రూప్ నగర్  దుర్గంలో ఒక్క రాయి కూడా యథా స్దానంలో నిలవదు అంది. అయినా చెలకత్తె మాటలు, అదీ ముసలి చెలకత్తె మాట ఓ రాకుమారి ఎందుకు వింటుంది. 

 

ఎవరూ ఊహించనట్లుగా...  ఔరంగజేబు  పటాన్ని అందరిచేతా కాళ్ళతో తొక్కించి ముక్క ముక్కలు చేసేసింది. ఆ సన్నివేశాన్ని పటాలు అమ్మటానికి వచ్చిన ముసల్ది చేసేసింది. అయితే ఆమె అక్కడే దాన్ని మర్చిపోతే బాగానే ఉంటుంది. కానీ ఆమె ఆ విషయాన్ని డిల్లీలో ఉన్న తన కొడుక్కి చేరేసింది.   ఆ కొడుక్కి మనసులో ఓ ఆలోచన మెరిసింది. ఔరంగజేబుకి ఈ విషయం చేరవేసి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆలోచనను అమల్లో పెట్టాడు.  కొద్ది రోజులకు   ఔరంగజేబు దగ్గరకి ఈ విషయం చేరింది. ఆయన రాకుమార్తె చంచలపై మండిపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుని తన రాజ్యం తీసుకువచ్చి దాసిగా మార్చి అవమానించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమె తండ్రికి కబురు పంపాడు. నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని...అంతే ఈ విషయం విన్న చంచల తండ్రి ఆనందంతో పరవసించి పోయాడు. ఆయనకు అసలు జరిగిందేమిటి..   ఔరంగజేబు ఆలోచన ఏమిటి అనేది తెలియదు.

సుల్తాన్ అంతటి వాడు వచ్చి కోరి మరీ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే అంతకు మించి కావాల్సిందేమిటి.. ప్రక్క రాజ్యాలన్ని తను ఆక్రమించుకోవచ్చు...ఇలా సాగాయి ఆయన ఆలోచనలు. మరో ప్రక్క చంచల పరిస్దితి అగమ్యగోచరంగా మారింది. సరదాగా ,చిన్న పిల్లల చేష్టగా చేసిన ఓ పని ఆమె జీవితానికి ఉరితాడుగా మారుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. అందుకు కారణం    ఔరంగజేబు మీద అసహ్యం ఓ కారణం అయితే..   ఔరంగజేబుని పెళ్లి చేసుకుంటే తనపై పగ ఖచ్చితంగా తీర్చుకుంటాడని ఊహించింది. అప్పుడు ఆమెకు ఒకరే ఈ సమస్యలనుంచి బయిటపడేయగల వ్యక్తి కనిపించాడు. అతనే రాజసింహ. తమ శత్రురాజు రాజసింహ. తన తండ్రి ఆయన పేరు చెప్తే మండిపడతాడు. కానీ తనకు ఆయన అన్నా, ఆయన పరక్రమం అన్నా ఇష్టం. ఇటువంటి సమయంలో తనని గట్టెంక్కించేవాడు ఆయనే. ఆయన్ని ఎలా చేరుకోవాలి..తన మనస్సులో ఉన్న విషయం ఆయనకు ఎలా తెలపాలి..తనని, తన రాజ్యాన్ని ఎలా    ఔరంగజేబు  నుంచి కాపాడుకోవాలి...

 

 

ఇదీ రాజసింహ నవల నేపధ్యం...చాలా ఆసక్తికరంగా ఉంది కదూ..చాలా కాలం క్రితం వచ్చిన నవల అయినా ఎంతో ఆసక్తిగా , ప్రతి క్షణం ఉత్కంఠతో సాగే ఈ రచన ఆన్ లైన్ లోనూ లభ్యమవుతోంది. మీరు తెప్పించుకుని చదువుకోవచ్చు. 

http://www.logili.com/books/rajasimha-bakimchandra-chatarjee/p-7488847-15015265920-cat.html

comments